MP Attacked By BJP Goons | తమ పార్టీకి చెందిన యువ నాయకురాలిపై నమోదైన కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఎంపీకి ఘోరమైన అనుభవం ఎదురైంది. బీజేపీ కార్యకర్తలు ఆయుధాలు చేతబట్టి, హెల్మెట్లు ధరించి ఎంపీ బృందంపై దాడికి దిగారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలలో వెలుగు చూసింది.
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాయోనీ ఘోష్‌పై ఇక్కడ ఒక కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ఎంపీ సుస్మితా దేవ్ ఇక్కడకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలోనే హెల్మెట్లు ధరించి, ఆయుధాలు పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి సుస్మిత బృందంపై దాడి చేశారు.
దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘సాయోనీ ఘోష్‌పై కేసు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వస్తే.. బీజేపీ గూండాలు మాపై దాడి చేశారు. హెల్మెట్లు ధరించి, ఆయుధాలు చేతపట్టుకొని మమ్మల్ని చుట్టుముట్టేశారు’ అని ట్వీట్ చేశారు.
ఈ వీడియోను త్రిపుర టీఎంసీ వర్గాలు ట్విట్టర్లో పోస్టు చేశాయి. త్రిపుర బీజేపీ ఈ ఘటన చూసి సిగ్గుపడాలని, సీఎం బిప్లబ్ దేవ్ గూండాలు ఇలా పోలీసుల కళ్ల ముందే దాడి చేసి తప్పించుకుంటున్నాయని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
We have been attacked by the @BJP4Tripura goons while we were being questioned inside the East women police station by @Tripura_Police in the case filed against @sayani06
— Sushmita Dev সুস্মিতা দেব (@SushmitaDevAITC) November 21, 2021
We are surrounded by armed men with weapons & wearing helmets. @AITCofficial https://t.co/l3iF4pDx61