అలాంటిదేం లేదు : మదర్ థెరిస్సా ఛారిటీ అకౌంట్ల సీజ్‌పై గ్రూపు ప్రతినిధి స్పందన
కోల్‌కతా : మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంక్ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ గ్రూపు ప్రతినిధి సునీతా కుమార్ స్పందించారు.

కోల్‌కతా : మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంక్ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ గ్రూపు ప్రతినిధి సునీతా కుమార్ స్పందించారు. ఛారిటీ బ్యాంకు లావాదేవీలు యధావిధిగా సాగుతున్నాయని, బ్యాంకు ఖాతాల స్తంభనపై కేంద్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అంతా సజావుగా సాగుతోందని స్పష్టం చేశారు.
బ్యాంక్ ఖాతాల సీజ్ విషయం తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంక్ అకౌంట్లను కేంద్రం సీజ్ చేసిందని దీంతో ఛారిటీకి చెందిన 22,000 మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేక ఇబ్బందిపడుతున్నారని మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
చట్టం అత్యున్నతమైనదే అయినా మానవత్వంతో కూడిన కార్యకలాపాలకు అడ్డుపడరాదని దీదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. క్రిస్మస్ రోజున మదర్ ధెరిస్సా ఛారిటీ బ్యాంకు ఖాతాలను కేంద్రం సీజ్ చేయడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

