న్యూఢిల్లీ : తల్లులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. పిల్లలకు చిన్న అసౌకర్యం కలిగినా తల్లి వారి వెన్నంటి నిలిచి భరోసా ఇస్తూ బాసటగా నిలుస్తుంది. భారీ వర్షంలో తన పిల్లలను కాపాడుతున్న తల్లి కోడి వీడియోను (Viral Video) ఐఏఎస్ అధికారి డాక్టర్ సుమితా మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 99,000 మందికిపైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో కుండపోత నుంచి పిల్లలను కాపాడేందుకు కోడి తానే షెల్టర్‌గా నిలిచిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
माँ केवल माँ होती है, चाहे वह इंसान हो या पशु-पक्षियों की प्रजाति। माँ की ममता का रूप एक है। pic.twitter.com/96y7jlMsrb
— Dr Sumita Misra IAS (@sumitamisra) March 9, 2023
భారీగా వర్షం కురుస్తున్నా తనను కాపాడుకోవడం కోసం కోడి ఎలాంటి ప్రయత్నం చేయకపోగా కోడి పిల్లలను భద్రంగా తాను పొదువుకోవడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. తల్లి ఏ రూపంలో ఉన్నా తల్లే..తల్లి ప్రేమ ఒక్కటే అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. తల్లి స్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :