న్యూఢిల్లీ : పిల్లలను కాపాడుకునేందుకు తల్లి ఎంతవరకైనా వెళుతుంది..బిడ్డల బాగు కోసం ఏం చేసేందుకూ వెనుకాడదు. ఈ ఎమోషన్ కేవలం మనుషులకే పరిమితం కాదు..జంతువులు సైతం తమ పిల్లలను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తాయి. ఈ వైరల్ వీడియో (Viral Video) ఇందుకు పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది.
ఈ వీడియోలో హైనా నుంచి తన పిల్లను కాపాడుకునేందుకు జిరాఫీ పడే తపన నెటిజన్లను ఆకట్టుకుంటుంది. గేబ్రియేల్ కర్నో ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో వ్యూస్ లభించాయి. ఈ వైరల్ క్లిప్‌లో తన పిల్లతో కలిసి జిరాఫీ నిలుచుండగా హైనా వెంటాడుతుండటం కనిపిస్తుంది. హైనా దగ్గరకు రావడంతో జిరాఫీ దానిమీదికి ఉరికేందుకు ఉద్యుక్తమవగా హైనా తోకముడవటం చూడొచ్చు.
Mother giraffe protects her baby from a hyena
🎥 wild.animalpower pic.twitter.com/wvSeY49iSf— Gabriele Corno (@Gabriele_Corno) June 21, 2023
హైనా నుంచి తన పిల్లను కాపాడుకున్న తల్లి జిరాఫీ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. తల్లి సాహసం అద్భుతమని ఓ యూజర్ ప్రశంసించగా, పిల్లల కోసం తల్లులు ఎంతకైనా తెగిస్తారని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
MS Dhoni: రాంచీ వీధుల్లో మినీ కూపర్‌లో ధోనీ చక్కర్లు.. వీడియో