MS Dhoni: రాంచీ వీధుల్లో మినీ కూపర్‌లో ధోనీ చక్కర్లు.. వీడియో
MS Dhoni: రెడ్‌కలర్ మినీ కూపర్ కారులో ధోనీ చక్కర్లు కొట్టాడు. రాంచీ వీధుల్లో అతను ఆ కారును డ్రైవ్ చేశాడు. ధోనీ గ్యారేజీలో ఇంకెన్నో రకాల వింటేజ్, లగ్జరీ కార్లు ఉన్నాయి.
రాంచీ: టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ(MS Dhoni)కి బైక్‌లంటే తెగ ఇష్టం. అంతేకాదు.. ఫ్యాన్సీ కార్లను కూడా ఆయన అంతే లైక్ చేస్తాడు. ధోనీ గ్యారేజీలో వింటేజ్, లగ్జరీ, బడ్జెట్ కార్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ నుంచి జార్ఖండ్‌లోని స్వంత ఊరు రాంచీకి వెళ్లిన అతను.. అక్కడ ఓ రెడ్ కలర్ మినీ కూపర్‌లో షికారు చేశాడు. ఆ ట్రిప్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాంచీ వీధుల్లో 1959 నాటి మినీ కూపర్‌లో ధోనీ చక్కర్లు కొట్టాడు. ఆ లైట్‌వెయిట్ కారు వేగానికి మారుపేరులా ఉంటుంది.
ధోనీ వద్ద నిసాన్ జాంగా కారు కూడా ఉంది. ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన ఈ కారును ధోనీ తెప్పించుకున్నాడు. ఆర్మీ పట్ల ఉన్న ప్రేమతో ధోనీ ఆ కారును తన కలెక్షన్లో పెట్టుకున్నాడు. సుమారు కోటిన్నర ఖరీదు చేసే ఫెర్రారీ 599 జీటీవో కారు కూడా ధోనీ గ్యారేజీలో ఉంది. ఇక అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ కారు కూడా అతని వద్ద ఉంది.
హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, లాండ్ రోవర్ ఫ్రీలాండర్2, మహేంద్ర స్కార్పియో, జీప్ గ్రాండ్ చిరోకీ ట్రాక్‌హాక్, పాంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్, మెర్సిడీజ్ బెంజ్ జీఎల్ఈ, రోల్స్ రాయ్స్ సిల్వర్ షాడో, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్‌తో పాటు ఇంకా ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. ఫార్మ్‌హౌజ్‌లో స్వరాజ్ ట్రాక్టర్ కూడా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

