న్యూఢిల్లీ: పాల ధరలు మళ్లీ పెరిగాయి. మదర్ డైరీ సంస్థ లీటరు పాలపై రూ.2 పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్లో కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ ఏడాది అయిదోసారి మదర్ డైరీ సంస్థ పాల ధరలను పెంచింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మదర్ డైరీ అత్యధిక స్థాయిలో పాలను అమ్ముతోంది. ఆ నగరంలో రోజుకు సుమారు 30 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. మదర్ డైరీ ఫుల్ క్రీమ్ లీటరు పాలు రూ.66కు అమ్మనున్నారు. టోన్డ్ మిల్క్ ధర ఇప్పుడు రూ.53కు రానున్నది.