టొరంటో: క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆంకాలజీలో ప్రచురితమయ్యాయి. క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారిలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దవాఖానలో చేరాల్సిన పరిస్థితి, మరణించే ప్రమాదం కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.