న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నాటికి దేశ ంలో కాలుష్యాన్ని 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత శాస్త్రవేత్తలు సోడియం-ఐయాన్ బ్యా టరీ (ఎస్ఐబీ)ల సామర్థ్యాన్ని మరిం త మెరుగుపరిచే కాథోడ్ మెటీరియల్ను అభివృద్ధి చేసినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది. ఈ కొత్త మెటీరియల్ గాలి, నీటిలోనూ అత్యుత్తమ ఎలక్ట్రోకెమికల్ సైక్లికాలిటీ, స్థిరత్వాన్ని కనబరుస్తుంది.
వీటిలో వినియోగించే పదార్థాలు కన్జుమర్ ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్రిడ్ఎనర్జీ స్టోరేజ్, పునరుత్పాదకశక్తి నిల్వతో పాటు ఎలక్ట్రిక్వా హనాలకు అతి తక్కు వ ఖర్చుతో వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. సోడియం నిల్వలు పుష్కలంగా ఉన్న మన దేశం లో తాజా ఆవిష్కరణ ఎంతో కీలకం కానుంది. భారత మార్కెట్లో రాబోయే సోడియం-అయాన్ బ్యాటరీ వ్యవస్థకు ఇది మరింత ఊతమివ్వనుంది. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అమర్త్య ముఖోపాధ్యాయ సారథ్యంలో మెటీరియల్ సైన్స్ ఎలక్ట్రోకెమికల్ సూత్రాలను ఉపయోగించుకుని అధిక పనితీరు గల ఎన్ఏ-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు.