రాజస్థాన్: రాజస్థాన్లో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో 4500 ఏండ్ల నాటి నాగరికతకు సంబంధించిన చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. దీగ్ జిల్లాలోని బహజ్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో మహాభారతం, మౌర్య, శుంగ రాజ్యాల కాలాల నాటివిగా చెప్తున్న మానవ అస్తిపంజరాలు, విగ్రహాలు, సామగ్రి, లోహ ఆయుధాలు లభ్యమయ్యాయి. బహజ్ గ్రామంలో కొన్ని చారిత్రక ఆనవాళ్లను గుర్తించి, తవ్వకాలు జరిపారు. బహజ్ గ్రామం బ్రజ్ ప్రాంతానికి చెందినది. యూపీలోని మధురా కూడా బ్రజ్ పరిధిలోకి వస్తుంది. తవ్వకాల్లో లభ్యమైన ఆధారాల కాలాన్ని నిర్ధారించేందుకు తదుపరి పరీక్షల కోసం ఇజ్రాయెల్ పంపించారు.