Monu Manesar: మోనూ మనేసర్‌ను అరెస్టు చేయండి.. హర్యానా రైతుల డిమాండ్
Monu Manesar: భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్‌ను అరెస్టు చేయాలని కాప్ పంచాయతీలు, హర్యానా రైతులు డిమాండ్ చేశారు. ఇద్దరు ముస్లిం యువకుల్ని హత్య చేసిన కేసులో అతను వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో స్థానిక రైతు సంఘాలు, కాప్ పంచాయతీలు ఓ డిమాండ్ చేశాయి. భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్(Monu Manesar)ను అరెస్టు చేయాలని కోరాయి. ముస్లింలు మెజారిటీగా ఉండే నుహ్ జిల్లాలో జూలై 31వ తేదీన జరిగిన హింసలో ఆరు మంది మృతిచెందారు. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఓ గ్యాంగ్ అటాక్ చేసింది. మరణించిన వారిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో ఇద్దరు ముస్లింల హత్య జరిగింది. ఆ కేసులో మనేసర్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. నుహ్ జిల్లాలో జరగనున్న ర్యాలీలో అతను పాల్గొంటాడని సమాచారం రావడంతో అక్కడ భారీ ఎత్తున హింస చోటుచేసుకున్నది. నుహ్ హింసపై ఇప్పటికే 113 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 305 మందిని అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న మరో 106 మందిని విచారిస్తున్నారు.
నుహ్ హింసను రైతు సంఘాలు ఖండించాయి. శాంతి, సామరస్యాన్ని స్థాపించాలని తీర్మానం చేశాయి.భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

