సెప్టెంబర్ 1 నుంచి నెలంతా దుర్గా పూజా వేడుకలు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దుర్గా పూజా వేడుకలకు పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అంత సందడిగా ఇవి జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జరుపుతామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు దుర్గా పూజ వేడుకలను నిర్వహిస్తామని సోమవారం అన్నారు. ప్రారంభం రోజైన సెప్టెంబర్ 1న కోల్‌కతాలో భారీ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. దుర్గా పూజకు వారసత్వ ట్యాగ్‌ని అందించిన యునెస్కో (UNCESO)కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రంగుల మయం చేయాలని, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పూజా కమిటీలు, ప్రజలకు పిలుపునిచ్చారు. యునెస్కో సభ్యులతోపాటు విదేశీ ప్రతినిధుల బృందాలు కూడా కోల్‌కతాను సందర్శిస్తాయని అన్నారు. భారీ ర్యాలీతో ప్రారంభమయ్యే దుర్గా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 8న మెగా కార్నివాల్‌తో ముగుస్తాయని వివరించారు.
మరోవైపు దుర్గా పూజా కమిటీలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.50,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు సీఎం మమత తెలిపారు. పన్నులు రద్దు చేయడంతోపాటు విద్యుత్ బిల్లులపై రాయితీని 50 శాతం నుంచి 60 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రభుత్వ సెలవు రోజులుగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

