PM Modi |న్యూఢిల్లీ: ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య ఆదివారం 10 కోట్లను దాటింది. గడచిన మూడేళ్లలో దాదాపు 3 కోట్ల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ వేదికపై ఎక్కువ మంది ఫాలో అయ్యే ప్రభుత్వాధినేత మోదీనే.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.