న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఓబీసీలను కించపరిచానంటూ బీజేపీ తనను నిందిస్తున్నదని, నిజానికి ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కించపరుస్తున్నది బీజేపీయేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. రాబోయే రోజుల్లో మోదీ సర్కార్ ఈ దేశాన్ని అదానీకి అమ్మేస్తుందని ఆరోపించారు. పరువునష్టం కేసులో అనర్హత వేటు పడ్డాక తొలిసారిగా ఆయన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కులగణన జరిగింది. మోదీ సర్కార్ వచ్చాక డాటా బయటకు రాకుండా అడ్డుకుంటున్నది. బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం నేడు కేవలం ఏడు శాతానికి పరిమితం. కులగణన డాటా బయటకు వస్తే ఓబీసీలను ఎవరు కించపరిచారన్నది అందరికీ తెలుస్తుంది’ అని తెలిపారు.