న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను పూర్తిగా వ్యతిరేకినని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్‌కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆర్థిక విధానాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాలు చేశారు. ‘మోదీ.. దేశానికి రాజు కాదు’ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్, అజిత్ దోవల్ తమ గజిబిజి విధానాలతో పక్క దేశాలతో సత్సంబంధాలు చెడగొట్టారన్నారు.