న్యూఢిల్లీ: జీ20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఇవ్వనున్న విందుకు సంబంధించిన ఆహ్వాన లేఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు అందలేదు. దీంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోదీ కుల వివక్షకు పాల్పడుతున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది. మోదీ హై తో మను హై అంటూ ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మోహన్ కుమారమంగళం ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. మహర్షి మనువు సిద్ధాంతాలను ప్రధాని మోదీ పాటిస్తున్నట్లు ఆరోపించారు. ప్రాచీన హిందూ సంప్రదాయానికి సంబంధించిన మనుస్మృతి ఆయన రాసిందే. మను మహర్షి సూత్రాలను మోదీ అవలంబిసత్ఉన్నట్లు కుమారమంగళం ఆరోపించారు. అందుకే దళిత నేత అయిన మల్లిఖార్జున్ ఖర్గేను జీ20 డిన్నర్‌కు ఆహ్వానించలేదని విమర్శించారు. అయోధ్యలో భూమిపూజకు ఆనాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇక కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్ సెర్మనీకి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించలేదని కుమారమంగళం ఆరోపించారు.