కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 1 నాటికి, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ క్యాటగిరీలో ఈ ఏడాది ఖాళీలు 21,837 పెరిగాయి. దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 18 రైల్వే జోన్లలో 3,15,780 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.