న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’లో భాగంగా దేశంలోని వెయ్యి చిన్న రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ భావిస్తున్నది. ఇందుకు గానూ స్టేషన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ప్రయాణికుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వివిధ నగరాలకు అనుసంధానంగా ఉండే స్టేషన్లను గుర్తించాలని అధికారులకు సూచించింది.