జైపూర్: ప్రభుత్వ స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి స్టూడెంట్ను మరో స్టూడెంట్ను కత్తితో పొడిచాడు. (Mob Sets Cars On Fire) గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు, జనం రెచ్చిపోయారు. రాళ్లు రువ్వడంతోపాటు పలు కార్లకు నిప్పుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ప్రభుత్వ స్కూల్లో లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల హిందూ విద్యార్థి తొడపై ముస్లిం విద్యార్థి కత్తితో పొడిచాడు. గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ ఆసుపత్రికి వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు, జనం రెచ్చిపోయారు. ఉదయ్‌పూర్‌లో అల్లర్లకు పాల్పడ్డారు. పలు చోట్ల రాళ్లు రువ్వడంతోపాటు సుమారు ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. అలాగే నగరంలో నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు కత్తితో పొడిచిన విద్యార్థితోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని ఉదయపూర్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
BREAKING: Massive outrage and communal tension in Udaipur, Rajasthan, after a Dalit Hindu minor student, studying in the 10th standard, was brutally attacked by an Islamist student inside the school premises. The perpetrator assaulted him multiple times with knife.
Entire… pic.twitter.com/E8f3hflOrj
— Treeni (@TheTreeni) August 16, 2024