Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఘర్షణ పడ్డ ఎమ్మెల్యేలు.. వీడియో
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
జమ్మూ: వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని జమ్మూకశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీలో మూడు రోజులగా వాయిదాల పర్వం నడుస్తోంది. అయితే ఇవాళ కొందరు ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో ఘర్షణ పడ్డారు. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. అసెంబ్లీలో లోపల ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలుగా మారిన ఎమ్మెల్యేలు.. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు.
గత రెండు రోజుల నుంచి కూడా అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీమ్ వాయిదా వేశారు. ఇవాళ కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. ఇటీవల కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునిల్ శర్మ కూడా వెల్‌లోకి దూసుకెళ్లిన ఎన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సభలో ధర్నా చేపట్టారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో హౌజ్‌ను స్పీకర్ వాయిదా వేశారు.
#WATCH | J&K: MLAs clash inside the premises of the legislative assembly.
The house has been adjourned till 1 pm, following an uproar by NC MLAs demanding a discussion on the Waqf Act. pic.twitter.com/s3R8VnJ2w1
— ANI (@ANI) April 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

