షాద్‌నగర్ టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డులో నూతన సీసీరోడ్డు పనులతోపాటు పలు వార్డుల్లో సోమవారం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా వార్డుల్లో పలు పనులను ప్రారంభించామన్నారు.
మున్సిపాలిటీలోని అన్ని వార్డులను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా వార్డులకు సంబంధించిన కాలనీల్లో జరిగే అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ నిధులు రూ.7.50 లక్షలతో సీసీరోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యేను స్థానిక నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, మాజీ చైర్మన్ విశ్వం, మాజీ కౌన్సిలర్ సరితా యాదగిరి యాదవ్, నాయకులు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, బస్వం, రాజేందర్, శ్రీశైలంగౌడ్, నర్సింహ్మ, శ్రీనివాస్, ఇబ్రహీం, శ్రీను, విజయ్, అర్జున్ లక్ష్మణ్, శ్రీధర్, మోహన్, మాధవులు, ఖదీర్, దిలీప్, రమేష్ పాల్గొన్నారు.
పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు చదువే ప్రధానమని ఎమ్మెల్యే అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ సిండికేట్ కాలనీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన బడీడు పిల్లలను సోమవారం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని, బడీడు పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. ఫరూఖ్‌నగర్ మండలంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎంఈవో మనోహర్‌ను అభినందించారు.