న్యూఢిల్లీ: మహారాష్ట్ర మంత్రులు ఫోన్ ట్యాపింగ్ భయంతో.. తమ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ఆ ఆరోపణలకు సాక్ష్యాధారాలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది మంత్రులు ఫోన్లు అందుబాటులో లేవని, అయితే ట్యాపింగ్ జరుగుతుందో ఏమో అన్న భయంతో ఫోన్లను స్విచాఫ్ చేసి ఉంటారని, రానున్న రోజుల్లో దీంట్లో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుందని రోహిత్ పవార్ పేర్కొన్నారు.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో రోహిత్ పవార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కర్జాత్ జామ్ఖేడ్ నుంచి ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోపణలు చేసే హక్కు ఉందని, కానీ ఆ ఆరోపణలను సమర్థించుకోవడానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అజిత్ పవార్ అన్నారు.
మహారాష్ట్రలో క్యాబినెట్ మార్పులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఇటీవల ఉద్దవ్‌కు చెందిన శివసేన వర్గం ఆరోపించింది. అయితే ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మంత్రుల్లో అయిదారుగురిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
काही मंत्र्यांचे फोन बऱ्याचदा #not_reachable येत असून आपले फोन टॅप होत असल्याने मंत्री स्वतःहूनच फोन बंद ठेवततात, अशी चर्चा दबक्या आवाजात सुरुय.
बघुया या केवळ चर्चा आहेत की वास्तव हे येत्या काळात कळेलच..!— Rohit Pawar (@RRPSpeaks) July 25, 2025