చెన్నై: నటుడు విజయ్ నేతృత్వలోని తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శులతో మాట్లాడిన ఆయన గతంలో ఎన్నికల పరాజయాల నుంచి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తుచేస్తూ, పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని భరోసా ఇచ్చారు. ‘ఈ ఓటమి తాత్కాలికం. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం మళ్లీ పుంజుకుని గెలుస్తాం. తమిళనాడులో సూర్యుడు(డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు’ అని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని, ఈ విషయంలో విజయ్‌కి చెందిన టీవీకే చాలా ముందున్నదని పేర్కొన్నారు.