చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ( MK Stalin )జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీకెండ్స్‌లో స్టాలిన్ జిమ్‌లో కొంత సమయం గడుపుతారని ఆ వీడియో ద్వారా స్పష్టమైంది. 37 నిమిషాల క్లిప్‌లో స్టాలిన్ రొటీన్ పులప్ చేశారు. ఇటీవల చెన్నైలోని మామల్లపురంలో ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్లారు. సైకిల్ తొక్కుతూ స్థానికులతో సెల్ఫీలు కూడా దిగారు. సీఎం సైకిల్‌పై వెళ్లడాన్ని చూసి ప్రజలు స్టన్ అయ్యారు. అయితే యోగా తన డెయిలీ రొటీన్లో భాగమని ఇటీవల స్టాలిన్ ఓ మీడియాతో పేర్కొన్నారు. తానెంత బిజీగా ఉన్నా.. మనవళ్లతో రిలాక్స్ అవుతానని, ఉదయమే నిద్ర లేచి, వాకింగ్ లేదా యోగా చేస్తానని, పది రోజుల్లో ఒక్కసారైనా సైకిల్ తొక్కుతానని ఆయన తెలిపారు. అప్పుడప్పుడూ కర్నాటక సంగీతం వింటుంటానన్నారు.
What keeps M K Stalin busy during weekends. pic.twitter.com/vvXH6Xb8ur
— J Sam Daniel Stalin (@jsamdaniel) August 21, 2021