తప్పిపోయిన అరుణాచల్ బాలుడు కనిపించాడు: చైనా ఆర్మీ

న్యూఢిల్లీ: తప్పిపోయిన అరుణాచల్ బాలుడు కనిపించాడని చైనా ఆర్మీ తెలిపింది. ఆ బాలుడ్ని అప్పగించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు భారత ఆర్మీకి సమాచారం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన 17 ఏండ్ల మిరాన్ టారోన్ బుధవారం కనిపించకుండాపోయాడు. అయితే ఆ బాలుడ్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్‌ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు.
మరోవైపు తప్పిపోయిన బాలుడి గురించి సమాచారం అందుకున్న భారత ఆర్మీ వెంటనే పీఎల్ఏని సంప్రదించింది. బాలుడి ఆచూకీని కనుగొనడంలో సహకరించాలని కోరింది. అయితే, ఆ బాలుడు తమ ఆధీనంలో లేడని, అతడి గురించి ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పీఎల్ఏ తొలుత బుకాయించింది. బాలుడు పీఎల్ఏ ఆధీనంలోనే ఉన్న సంగతి బయటపడటంతో అతడి ఆచూకీని కనుగొనట్లు భారత ఆర్మీకి ఆదివారం తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. “అరుణాచల్ ప్రదేశ్‌లో తప్పిపోయిన బాలుడిని కనుగొన్నామని చైనా సైన్యం మాకు తెలియజేసింది. అతడ్ని అప్పగించేందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తోంది” అని తేజ్‌పూర్‌కు చెందిన డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే ఆదివారం ప్రకటించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులతోపాటు అరుణాచల్‌ప్రదేశ్ అధికారులు ఊరట చెందారు.
The Chinese Army has communicated to us that they have found a missing boy from Arunachal Pradesh and the due procedure is being followed: PRO Defence, Tezpur Lt Col Harshvardhan Pandey
— ANI (@ANI) January 23, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

