లక్నో: కొందరు వ్యక్తులు ఒక యువకుడ్ని కర్రలతో కొట్టారు. తుపాకులు చూపుతూ కాల్చి చంపుతామని బెదిరించారు. (Miscreants Brutally Thrash Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ నేత, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అధికార బీజేపీకి చెందిన కొంతమంది గూండాలు చెలరేగిపోయారు. బైక్పై మార్కెట్కు వెళ్తున్న సత్యం శర్మను అడ్డుకున్నారు. అతడ్ని చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో కొట్టారు. పిస్టల్స్ చూపించి కాల్చి చంపుతామని బెదిరించారు. ఈ నేపథ్యంలో దాడికి గురైన ఆ యువకుడు తనను ఎందుకు కొడుతున్నారో చెప్పాలంటూ వారిని ప్రాధేయపడ్డాడు.
కాగా, సెప్టెంబర్లో జరిగిన ఈ సంఘటనపై సత్యం శర్మ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. బీజేపీ మండల ఇన్చార్జీ అవధేష్ శర్మ, అతడి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
इन दबंगों का त्वरित इलाज किया जाए! @Uppolice @homeupgov
युवकी डंडे से बेरहमी से पिटाई का वीडियो वायरल हुआ है, सुल्तानपुर के कुड़वार थानाक्षेत्र अंतर्गत उतमानपुर गांव के निकट का मामलाबताया जा रहा है. अवैध असलहे लिए बदमाशों ने घटना को अंजाम दिया. सात आरोपी नामजद
Disclaimer:… pic.twitter.com/TC21wZ6QLs
— gyanendra shukla (@gyanu999) November 5, 2023