Viral Video | మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో పదో తరగతి బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే స్థానికులు చాకచక్యంగా స్పందించి యువకుడి బారినుంచి బాలికను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర సతారా పట్టణంలోని ఓ కాలనీలో ఉండే మైనర్ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో నివసించే 18 ఏళ్ల యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని కొంతకాలంగా వెంటపడుతున్నాడు. అయితే అతని ప్రపోజల్‌ను బాలిక తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు.. సదరు బాలికను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అడ్డగించాడు. ఆమె మెడపై కత్తి పెట్టి తన ప్రేమను అంగీకరించాలని బెదిరించాడు.
ఇది గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి యువకుడి బారి నుంచి బాలికను తప్పించారు. ముందుగా స్థానికులు యువకుడితో మాట్లాడారు. బాలిక మెడపై నుంచి కత్తిని తీసేయాలని పది నిమిషాల పాటు మాట్లాడారు. కానీ ఆ బాలికను వదిలే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో ఒక వ్యక్తి యువకుడిని మాట్లాడిస్తూ.. అతని దృష్టి మరల్చగా.. మరో వ్యక్తి వెనుకనుంచి వచ్చి అతని చేతిలో నుంచి బాలికను విడిపించాడు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మహారాష్ట్ర – సతారాలో 10వ తరగతి చదివే మైనర్ బాలికను మెడపై కత్తి పెట్టి బెదిరించిన 18 ఏళ్ల యువకుడు
కొంతకాలంగా తనను ప్రేమించాలని బాలిక వెంటపడ్డ యువకుడు
బాలిక తిరస్కరించడంతో బడి నుండి వచ్చే సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించిన యువకుడు
చాకచక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడి నుండి… pic.twitter.com/gyPCR7UwqQ
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2025