న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్ దర్యాప్తు భారత్‌లోనే చేపడుతున్నామని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ అంశంపై మీడియాలో వస్తున్న పలు వార్తా కథనాల్ని తోసిపుచ్చుతూ, భారత్‌లోని ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ మాత్రమే దర్యాప్తు చేస్తున్నదని ఆయన చెప్పారు.
విమాన ప్రమాదం తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో బ్లాక్ బాక్స్ రికార్డర్లు దెబ్బతినటంతో అందులోని డాటా విశ్లేషణ కోసం.. దానిని అమెరికాకు పంపాలని కేంద్రం భావిస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.