శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 25, 2020 , 23:20:32

స్థానిక వ‌స్తువుల‌కు ప్రోత్సాహం : కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్

స్థానిక వ‌స్తువుల‌కు ప్రోత్సాహం : కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్

ఢిల్లీ : భార‌త ప్ర‌భుత్వవిభాగాల‌లో, భార‌తీయ రైల్వేలోని ప్రొక్యూర్‌మెంట్ ప్ర‌క్రియ‌ల‌లో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్స‌హించేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై  రైల్వే, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ భార‌తీయ రైల్వేల‌లో అవినీతి ర‌హిత‌, పార‌ద‌ర్శ‌క ప్రొక్యూర్‌మెంట్ విధానం ఉన్నద‌న్న విశ్వాసం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో క‌ల్పించాల‌ని సూచించారు.

ప్రోక్యూర్‌మెంట్ ప్ర‌క్రియ‌లో మేక్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తు‌లును ప్రోత్స‌హించేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై ప్రోక్యూర్ మెంట్ ప్ర‌క్రియ‌లో స్థానిక వెండ‌ర్లు పాల్గొన‌డాన్ని పెంచేలా చూడాల‌ని అన్నారు. స్థానిక వెండ‌ర్లు, స‌ర‌ఫ‌రా దారుల నుంచి మ‌రిన్ని బిడ్లు వ‌చ్చే విధంగా ప్రొక్యూర్ మెంట్ నిబంధ‌న‌ల‌లో స్థానిక కంటెంట్ క్లాజు ఉండాల‌ని నిర్ణ‌యించారు.ఇది ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ మిష‌న్‌కు మ‌రింత ఊపు నివ్వ‌నుంది. ఈ దిశ‌గా భార‌తీయ రైల్వే కృషి చేసేందుకు వీలుగా అవ‌స‌ర‌మైతే  డిపిఐఐటిని విధాన‌ప‌ర‌మైన అంశాల తేవాలనిఆయన అన్నారు. స్థానికంగా త‌యార‌య్యే వ‌స్తువుల‌ను ఎవ‌రు ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రాచేయ‌గ‌లుగుతారో అలాంటి వెండ‌ర్ల‌కు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గోయల్ అభిప్రాయ‌ప‌డ్డారు.  logo