హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): చంద్రయాన్-3 విజయవంతం కావడం దేశం గర్వించదగిన విషయమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రునిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగుతోందని పేర్కొన్నారు. భారతదేశం, ఇస్రో చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైందని రాజ్యసభ ఎంపీ సంతోశ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.