Military Officers couple suicide | న్యూఢిల్లీ: ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్‌గా పని చేస్తున్న తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన కొన్ని గంటలకే ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తున్న అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆగ్రాలోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో కెప్టెన్‌గా నియమితురాలైన రేణు మంగళవారం ఢిల్లీలోని ఆఫీసర్స్ మెస్‌లో ఉరేసుకున్నారు.
తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. తన భర్త పక్కనే తనను ఖననం చేయాలని కోరారు. భారత వైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త దీన్ దయాళ్ దీప్ మంళవారం ఉదయం అగ్రాలోని ఆఫీసర్స్ క్వార్టర్లో ఉరేసుకున్నారు.