కన్నుల పండువగా మిలన్ యుద్ధనౌకల పరేడ్
మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు
విశాఖ: మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. వివిధ దేశాల నౌకాదళాలు చేస్తున్న విన్యాసాలు, పరేడ్ విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మిరుమిట్లు గొలిపే టపాసులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆర్కే బీచ్ పండగ వాతావరణం నెలకొన్నది.
గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ తిలకిస్తున్నారు. తూర్పు నౌకాదళం వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకు జరగనున్నాయి. 39 దేశాలకు చెందిన 13 నౌకలు, జలాంతర్గాములు, యుద్ధవిమానాలు మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ పరేడ్‌లో భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా వివిధ నౌకాదళాలు ఆర్కే బీచ్ రోడ్డులో చేపట్టిన కవాతు ఆకర్శణగా నిలిచింది. వివిధ సైనిక స్కూళ్ల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శత్రుసేనలను మట్టుపెట్టే దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. అంతకుముందు ఐఎన్ఎస్ విశాఖను ఏపీ సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తర్వాత ఐఎన్ఎస్ వేలాను సందర్శించారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

