శ్రీనగర్: పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న సరిహద్దు సమస్యలను ఎదుర్కొనేందుకు శ్రీనగర్ బేస్‌ను మరింత పటిష్టం చేశారు. ఆ బేస్ వద్ద ఇప్పుడు మిగ్-29 యుద్ధ విమానాల(MiG-29 Fighter Jets)కు చెందిన స్క్వాడ్రన్లను మోహరించారు. మిగ్-21 బృందాల స్థానంలో ఇప్పుడు మిగ్-29 బృందాలు పనిచేయనున్నాయి. ఈ బృందాన్ని డిఫెండర్ ఆఫ్ నార్త్‌గా పిలుస్తున్నారు.
#WATCH | J&K: MiG-29 fighter aircraft deployed in Srinagar replacing the MiG-21 fighter jets at the base. pic.twitter.com/xwCJl28ad4
— ANI (@ANI) August 12, 2023
మిగ్-29 చాలా అప్‌గ్రేడ్ యుద్ధ విమానాలని పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా తెలిపారు. నైట్ విజన్ గగూల్స్తో ఈ విమానాలను రాత్రి పూట కూడా ఆపరేట్ చేయవచ్చు అన్నారు. ఎయిర్ టు ఎయిర్ రీఫ్యుయలింగ్ సామర్థ్యం ఉన్న కారణంగా .. వీటిని లాంగ్ రేంజ్లో కూడా ఆపరేట్ చేయవచ్చు అని చెప్పారు. భారతీయ వైమానిక దళానికి చెందిన పైలెట్లే ఈ విమానాలను ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు.
Another pilot Squadron Leader Shivam Rana said the upgraded aircraft can operate at night with night vision goggles and has a longer range due to air-to-air refuelling capability.
“We have also included the air-to-ground armament which was not there earlier. The biggest… pic.twitter.com/W6IxcfClMQ
— ANI (@ANI) August 12, 2023
కశ్మీర్ లోయలో శ్రీనగర్ చాలా ఎత్తు ప్రదేశంలో ఉందని, ఇలాంటి ప్రదేశంలో మిగ్-29 యుద్ధ విమానాన్ని మోహరించడం చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఐఏఎఫ్ పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ తెలిపారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు లాంచ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నారు.
#WATCH | "Srinagar lies in the centre of Kashmir valley and its elevation is higher than plains. It is strategically better to place an aircraft with a higher weight-to-thrust ratio and less response time due to proximity to the border and is equipped with better avionics and… pic.twitter.com/eq7vVgTpyA
— ANI (@ANI) August 12, 2023