న్యూఢిల్లీ: మిగ్-21(MiG-21) యుద్ధ విమానాలను.. భారతీయ వైమానిక దళం నుంచి తీసివేయనున్నారు. దశల వారీగా తొలగింపు ప్రక్రియ కొనసాగనున్నది. సెప్టెంబర్ నుంచి ఆ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. రష్యా తయారీకి చెందిన మిగ్21 యుద్ధ విమానాల స్క్వాడ్రన్లు రిటైర్ కానున్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా మిగ్21 భారతీయ వైమానిక దళంలో కీలక పాత్ర పోషించింది. పలు యుద్ధాల్లో ఆ యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. తాజాగా భారతీయ వైమానిక దళం.. తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను డెవలప్ చేసింది.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాలతో టేకోవర్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 36 మిగ్21 విమానాలు ఉన్నాయి. 1963లో తొలిసారి ఇండియా మిగ్ విమానాలను వాడడం మొదలుపెట్టింది. 2023 మిగ్21 విమానాన్ని చివరిసారి రాజస్థాన్లోని బార్మర్ నుంచి ఎగిరింది.
2025 చివరి నాటికి మిగ్21 విమానాలను తొలగించి, వాటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 1ఏ విమానాలను వినియోగించనున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ , ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు.