Woman’s Door Knock At Mid night | నిమ్మకాయ కోసం అర్ధరాత్రి వేళ మహిళ తలుపు తట్టడం ఆ అధికారికి తగదు: హైకోర్టు
Woman's Door Knock At Mid night | అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం మహిళ తలుపు తట్టడం ఆ అధికారికి తగని పని అని బాంబే హైకోర్టు పేర్కొంది. అతడి ప్రవర్తన నేపథ్యంలో అధికారులు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది.
ముంబై: అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం మహిళ తలుపు తట్టడం ఆ అధికారికి తగని పని అని బాంబే హైకోర్టు పేర్కొంది. అతడి ప్రవర్తన నేపథ్యంలో అధికారులు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది. (Woman’s Door Knock At Mid night) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్‌గా పని చేసిన 33 ఏళ్ల అరవింద్ కుమార్ 2021 ఏప్రిల్ 19న మద్యం సేవించాడు. సహోద్యోగి ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం బెంగాల్ ఉండటంతో అతడి భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. అర్ధ రాత్రి వేళ ఆమె ఇంటి తలుపుతట్టాడు.
కాగా, ఆరేళ్ల కుమార్తెతో కలిసి ఉన్న మహిళ తన భర్త ఇంట్లో లేడని అరవింద్‌కు చెప్పింది. తమను ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అరిచి అందిరినీ పిలుస్తానని హెచ్చరించడంతో చివరకు అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ మహిళ ఫిర్యాదుపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్పందించారు. అరవింద్ కుమార్ దుష్ప్రవర్తనపై చర్యలు చేపట్టారు. మూడేళ్లపాటు జీతం తగ్గించారు. అలాగే శిక్షగా ఆ కాలం వరకు ఎలాంటి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు.
మరోవైపు అరవింద్ కుమార్ దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తాను అస్వస్థతకు గురి కావడంతో నిమ్మకాయ కోసం మాత్రమే పొరుగింటి మహిళ తలుపు తట్టినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తులు నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం భర్త ఇంట్లో లేని మహిళ తలుపు తట్టడం సీఐఎస్ఎఫ్లో పని చేసే అధికారికి తగనిదని కోర్టు పేర్కొంది. పిటిషనర్ ఉద్దేశం ఖచ్చితంగా నిమ్మకాయ కోసం కాదని కోర్టు అభిప్రాయపడింది. అతడి దుష్ప్రవర్తనకు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది. మార్చి 11న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bombay High court
- Door
- Knock
- Lemon
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

