భోపాల్: మొఘల్ కాలం నాటి కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చావా సినిమాలో చూపించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జోరందుకున్నాయి. (Gold Hunt) అర్ధ రాత్రి వేళ గుంపులుగా వచ్చిన జనం టార్చిలైట్ వెలుతురులో అక్కడ తవ్వుతున్నారు. బంగారం, వెండి నాణేలు దొరికినట్లు కొందరు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొఘల్ కాలం నాటి అసిర్గఢ్ కోట ప్రాంతం బంగారు గనిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై తీసిన చావా చిత్రంలో చూపించారు.
కాగా, జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక దర్గా సమీపంలో జేసీబీతో మట్టిని తవ్వారు. స్థానిక గ్రామస్తుడి పొలంలో ఆ మట్టిని పోశారు. అయితే పురాతన కాలం నాటి లోహ నాణేలు ఆ మట్టిలో లభించినట్లు పుకార్లు చెలరేగాయి. దీనికి తోడు చావా చిత్రంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించడంతో అక్కడ తవ్వకాలు జోరందుకున్నాయి. సమీప గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రివేళ అక్కడకు చేరుతున్నారు. టార్చిలైట్ వెలుతురులో తవ్వకాలు జరుపుతున్నారు. మొఘల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు తమకు దొరికినట్లు కొందరు చెప్పారు.
మరోవైపు ఆ ప్రాంతంలో రాత్రివేళ జరుగుతున్న తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని పోలీసులు, అధికారులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి పురాతన నాణేలు లభించలేదని చెప్పారు. ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
After watching Bollywood film #Chhaava , villagers near AsirgarhFort in Burhanpur, MadhyaPradesh started started digging for Mughal-era gold with flashlights & metal detectors 💰⛏️
😂😂😂 pic.twitter.com/azImTJq0RZ— Sivangi Choudhury Mondal (@originalsibani) March 8, 2025
A villager is using a metal detector to discover the Mughal-Era #gold in the fields near #Asirgarh Fort of Madhya Pradesh #Burhanpur.
Coincidently, the land belongs to a Muslim. pic.twitter.com/tjlCpzSuR4
— काश/if Kakvi (@KashifKakvi) March 8, 2025