Baby Saved By Doctors Mid-Air | విమానం గాలిలో ఉండగా ఊపిరి కోసం ఇబ్బంది పడిన పసికందు.. కాపాడిన ఇద్దరు డాక్టర్లు
Baby Saved By Doctors Mid-Air | విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు (Baby Saved By Doctors Mid-Air). ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం రాంచీ నుంచి ఢిల్లీకి ఆ విమానం బయలుదేరింది. 20 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం గాలిలో ఉండగా పుట్టుకతో గుండె సమస్య ఉన్న పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడింది. తల్లి ఆందోళన చెందటంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సహాయం చేయాలని సిబ్బంది ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.
కాగా, జార్ఖండ్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మొజమిల్ ఫెరోజ్ ఆ చిన్నారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. పిల్లల మాస్క్ లేకపోవడంతో పెద్దల మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించారు. పేరెంట్స్ వద్ద ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారు. పుట్టుక నుంచి గుండె సమస్య ఉన్న ఆ పసికందును ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు విమానం ల్యాండింగ్ తర్వాత తక్షణ వైద్య సహాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆ ఇద్దరు డాక్టర్లు కోరారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కాగానే పూర్తి మెడికల్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ ద్వారా ఆ పసిబిడ్డను ఆసుపత్రికి తరలించారు. సుమారు గంటకుపైగా తాము అందించిన వైద్య సహాయం పట్ల సంతృప్తిగా ఉందని డాక్టర్ కులకర్ణి హర్షం వ్యక్తం చేశారు. పసికందు ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు డాక్టర్ల సేవలను మిగతా ప్రయాణికులు కూడా ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

