Farmers Protest | న్యూఢిల్లీ : హర్యాణా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకుని లబ్ది పొందుతున్నారని, రైతునేతలు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. దాంతో రాజకీయ నాయకులకు వాళ్ళ రూల్స్ మింగుడు పడటక, బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోతున్నారు. మద్దతు ధరల కోసం జరుగుతున్న రైతుల ఆందోళన నేటికి ఆరవ దశకు చేరుకున్న విషయం తెలిసిందే. నిరసనల కార్యక్రమాల్లో వేలల్లో రైతులు పాల్గొంటున్నారు. దీంతో రైతు నేతలందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఏ పార్టీ నాయకుడు అయినా వచ్చి ఉద్యమానికి మద్దతు ఇవ్వవచ్చని, తాము కూడా గౌరవిస్తామని,కానీ వేదికపై కుర్చీ ఇవ్వడం కాని, స్వాగతించడం కాని చేయబోమని, అంతే కాకుండా వేదిక పైనుంచి మాట్లాడేందుకు, వారికి మైకు ఇవ్వబోమని రైతు నేతలు ప్రకటించారు.
రాజకీయ నాయకులు తప్ప, సమాజానికి చెందిన ఇతర రంగాలలో సేవ చేసే ఎవరైనా వేదికపై నుండి ప్రసంగాలు చేయవచ్చన్నారు. ప్రతిరోజూ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుండి రైతు నాయకులు వచ్చి వేదికపై నుండి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారని మీకు తెలియజేద్దాం. రోజూ పదుల సంఖ్యలో రైతు నాయకులు వచ్చి వేదికపై తమ పేర్లను రాసి రైతులకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ వారు మద్దతిచ్చినట్లు ప్రకటిస్తూ రాజకీయ లబ్ది పొందేందుకే చూస్తున్నట్లు రైతు నాయకులు భావించి మైకు మాత్రం ఇవ్వబోమన్నారు.
రైతులను అడ్డుకునేందుకు శంభు సరిహద్దులో, పంజాబ్ సరిహద్దులో పోలీసులు బ్లాక్‌ను ఏర్పాటు చేశారు. కానీ దానిని రైతులు దాటుకుని ముందుకు వచ్చేశారు. మరో వైపు హర్యానాలో సరిహద్దువద్ద పోలీసులు పటిష్టంగానే పహరా కాస్తున్నారు. రైతులను లోనికి అనుమతించటం లేదు. దానిని దాటి రావటానికి అనేక ప్రయత్నాలు చేయగా, పోలీసులు టియర్ గ్యాస్ తోనూ, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించి నిలువరించారు.
ఉద్యమం పెరుగుతున్న కొద్దీ మహిళా రైతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూభోజన ఏర్పాట్లలో సహకరిస్తున్నారు. రైతు కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిల్లలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాస్తవానికి, పంజాబ్ నుండి రైతులు అధికంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అమృత్సర్, లూథియానా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల రైతులు ఎక్కువగా వచ్చారు. గత 5 రోజులుగా రైతులందరూ కుటుంబానికి దూరంగా ఉండటంతో కుటుంబసభ్యులు వారిని కలవడానికి వస్తున్నారు.