న్యూఢిల్లీ, జూలై 2: వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది.
దీంతో సుమారు 9 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ జూలైలో వేలాది మంది ఉద్యోగులను తొలగించనుందని బ్లూమ్బర్గ్ ఇటీవల వెల్లడించింది.