న్యూఢిల్లీ: ఖలిస్థాన్ అనుకూల సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థపై ఐదేండ్ల క్రితం నిషేధం విధించింది. పంజాబ్, తదితర చోట్ల దేశ సమగ్రత, భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు ఈ సంస్థపై నిషేధాన్ని మరో ఐదేండ్లు పొడిగించినట్లు కేంద్ర హోం శాఖ బుధవారం తెలిపింది.