ముంబై: ముంబైలోని సీ లింక్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. రెండు లగ్జరీ కార్లు.. మరో కారును ఢీకొన్నాయి(Cars Crashed). బాంద్రా-వర్లీ మధ్య ఉన్న బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. ఆదివారం జరిగిన ప్రమాదం వల్ల.. ట్రాఫిక్ జామైంది. దేశంలో అత్యంత పొడువైన బ్రిడ్జ్ ఇదే. సీ లింక్ బ్రిడ్జ్‌పై వెళ్తున్న రెండు కార్లు వేగంగా ప్రయాణించాయి. అదుపు తప్పిన ఆ కార్లు వాగన్ ఆర్ కారును ఢీకొన్నాయి. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. సీ లింక్‌పై వేగం పరిమితి గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే. రెండు కార్లకు చెందిన డ్రైవర్లు తారిక్ చౌదరీ, షేబాజ్ ఖాన్‌లను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేశారు. మెర్సిడీజ్ బ్యానెట్ డ్యామేజ్ అయ్యింది. బీఎండబ్ల్యూ కారుకు వెనుక భాగంలో డ్యామేజ్ జరిగింది. రెండు లగ్జరీ కార్లు.. రెండు సంస్థలపై రిజిస్టర్ అయి ఉన్నాయి.