గౌహతి: మానసిక వికలాంగురాలైన యువతిని జైలు గార్డులు ఈడ్చుకెళ్లారు. క్వాటర్స్లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Raped By Prison Guards) గమనించిన పెట్రోలింగ్ పోలీసులు నిందితులైన జైలు గార్డులను అరెస్ట్ చేశారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు రోడ్డుపై ఒంటరిగా ఉన్న మానసిక వికలాంగురాలైన మహిళను ఇద్దరు జైలు గార్డులు చూశారు. తమ క్వాటర్స్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జైలు వార్డెన్లు హరేశ్వర్ కలిత, గజేంద్ర కలితను నిందితులుగా గుర్తించారు. గౌహతిలోని పంజాబరి, బోరాగావ్ ప్రాంతాలకు చెందిన వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితురాలిని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.