Must Watch: గుర్రంతో బలవంతంగా గంజాయి తాగించిన వ్యక్తులు.. వీడియో వైరల్, ఒకరు అరెస్ట్
Men Forced Horse To Smoke | ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించారు (Men Forced Horse To Smoke). ఆ సిగరెట్ గంజాయితో కూడి ఉన్నట్లు కొందరు అనుమానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డెహ్రాడూన్: ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించారు (Men Forced Horse To Smoke). ఆ సిగరెట్ గంజాయితో కూడి ఉన్నట్లు కొందరు అనుమానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ గుర్రం యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాలయ పర్వాతాలున్న ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, వారి సామగ్రిని మోసేందుకు గుర్రాలను వినియోగిస్తారు. అలా సేవలందించే ఒక గుర్రానికి దాని యజమాని మరో వ్యక్తి కలిసి బలవంతంగా సిగరెట్ తాగించారు. గుర్రం నోరు, ముక్కు రంధ్రాన్ని ఒక వ్యక్తి తన చేతితో మూశాడు. మరో వ్యక్తి సిగరెట్‌ను గుర్రం రెండో ముక్కు రంధ్రం వద్ద ఉంచి బలవంతంగా పొగ తాగించేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే జీవనాధారమైన గుర్రాన్ని దాని యజమాని, మరో వ్యక్తితో కలిసి ఇలా హింసించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుపట్టారు. గంజాయితో కూడిన సిగరెట్‌ను గుర్రంతో బలవంతంగా స్మోక్ చేయించడంపై మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ రుద్రప్రయాగ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. కేదార్‌నాథ్‌కు 16 కిలోమీటర్ల ట్రెక్ మార్గంలోని చోటి లించోలి సమీపంలో, థారు క్యాంప్ వద్ద ఈ సంఘటన ఇటీవల జరిగినట్లు గుర్తించారు. జంతువుల పట్ల హింసకు సంబంధించిన కేసు నమోదు చేశారు. ఆ గుర్రం యజమాని రాకేష్ సింగ్ రావత్‌ను అరెస్ట్ చేసినట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ చంద్ర తెలిపారు. ఆ సిగరెట్లో గంజాయి ఉందా? అన్నదానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, ఏప్రిల్ 25న కేథార్నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు గుర్రాల పట్ల క్రూర ప్రవర్తనకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి.
#Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS
should look into this matter and find the culprit behind thishttps://t.co/yyX1BNMiLk— Himanshi Mehra (@manshi_mehra_) June 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

