MLA Sofia Firdous | న్యూఢిల్లీ, జూన్ 9: ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్(32) చరిత్ర సృష్టించారు. కేవలం 30 రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా.. బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్ర(69)పై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సోఫియా ఫిర్దౌస్ అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
తండ్రి మహమ్మద్ మోక్విమ్ బారాబంకి-కటక్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ను కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది. 2014, 2019 ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించటం ఆమెకు ఈసారి బాగా కలిసివచ్చింది.