Viral Video | పిలవని పెళ్లికెళ్లి విందు భోజనం చేశాడని.. విద్యార్థితో గిన్నెలు కడిగించారు..!
Viral Video | జబల్పూర్కు చెందిన ఓ విద్యార్థి భోపాల్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు పిలవకపోయినా వెళ్లాడు. అక్కడ ఉచితంగా పెళ్లి విందు చేశాడు. యువకుడిని గుర్తించిన పెళ్లివారు.. విద్యార్థితో బలవంతంగా గిన్నెలు కడిగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video | మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పిలవని పెళ్లికి వెళ్లి విందు భోజనం చేసినందుకు ఓ విద్యార్థి పట్ల పెళ్లి వారు కఠినంగా వ్యవహరించారు. అందరి ముందూ అవమానపరిచేలా శిక్షించారు.
జబల్పూర్కు చెందిన ఓ విద్యార్థి భోపాల్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు పిలవకపోయినా వెళ్లాడు. అక్కడ ఉచితంగా పెళ్లి విందు చేశాడు. యువకుడిని గుర్తించిన పెళ్లివారు.. విద్యార్థితో బలవంతంగా గిన్నెలు కడిగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ వ్యక్తి.. యువకుడితో బలవంతంగా గిన్నెలు కడిగిస్తూ కనిపిస్తాడు. ‘ఉచితంగా భోజనం చేస్తే శిక్ష ఏంటో తెలుసా.? ఇప్పుడు మీ ఇంట్లో లాగా గిన్నెలు మొత్తం నీట్‌గా శుభ్రం చేయాలి’ అని యువకుడికి చెప్తాడు. అనంతరం ‘నువ్వు ఏం చదువుతున్నావు..?’ అని ప్రశ్నించగా.. ‘ఎంబీఏ’ అని సమాధానమిస్తాడు. దీంతో సదరు వ్యక్తి ‘ఎంబీఏ చేస్తున్నావు. మీ తల్లిదండ్రులు డబ్బు పంపట్లేదా..?’ అని అవమానకరంగా మాట్లాడతాడు. అనంతరం ‘ప్లేట్స్ క్లీన్ చేశాకా ఎలా ఫీలవుతున్నావ్..?’ అని అడగ్గా.. ‘ఉచితంగా ఆహారం తిన్నాను. ఏదో ఒకటి చేయాలి కదా..!’ అంటూ విద్యార్థి సమాధానమిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
MBA student came to eat food without being invited at a marriage ceremony in Madhya Pradesh, people forced him to wash utensils !!
मध्यप्रदेश के एक शादी समारोह में बिना बुलाए खाना खाने पहुंचा MBA का छात्र, लोगों ने युवक से धुलाए बर्तन !!
+ pic.twitter.com/XmBGr85aTy— Ashwini Shrivastava (@AshwiniSahaya) December 1, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

