మోదీ, అమిత్ షా పాలు తాగకపోవచ్చు, కానీ.. : అమూల్ పాల ధర పెంపుపై కాంగ్రెస్ ఎంపీ
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్రజలపైనేగ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఏటా రెండుమూడు సార్లు పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్రజలపైనేగానీ, సంపన్నులపై కాదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా పాలు తాగకపోవచ్చని, కానీ.. దేశంలోని పసిబిడ్డలందరికీ పాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని అధిర్ రంజన్ గుర్తుచేశారు. మాటిమాటికి పాల ధరలు పెరుగుతుండటంతో తమ బిడ్డల ఆకలి తీర్చడానికి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. పాల ధరల పెంపు ద్వారా కేంద్రం మరోసారి తన బుద్ధిని నిరూపించుకుందని ఆయన మండిపడ్డారు.
అమూల్ డెయిరీ శుక్రవారం లీటర్కు రూ.3 చొప్పున పాల ధరలు పెంచేసింది. దాంతో అమూల్ గోల్డ్ పాల ధర లీటర్ రూ.66కు, అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.54కు, అమూల్ ఆవు పాల ధర లీటర్ రూ.56కు పెరిగింది. అమూల్ ఏ2 గేదె పాల ధర లీటర్ రూ.70కి చేరింది. పెరిగిన పాల ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయని అమూల్ డెయిరీ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

