లక్నో, మే 7: తన మేనల్లుడు, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఆయన పూర్తి పరిపక్వత సాధించే వరకు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. గత జూన్‌లో ఆకాశ్‌ను బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌గా నియమించారు. అయితే, అనూహ్యంగా ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించారు.