Mayawati | ఎక్కడికీ వెళ్లలేదు… పార్టీ పనుల్లోనే తలమునకలైపోయాను : మాయావతి
దాదాపు 147 రోజుల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ

Mayawati | దాదాపు 147 రోజుల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ, బీజేపీ, కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ హయాంలో కేవలం దళితులను మాత్రమే అణగదొక్కారని, దళితుల స్థితి ఏమాత్రం బాగోలేదని ఆరోపించారు. ఇక సమాజ్వాదీ హయాంలో గూండాలే రాజ్యమేలారని, గూండాలు సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. సమాజ్వాదీ హయాంలో అఖిలేశ్ యాదవ్ కేవలం కొన్ని వర్గాలను తృప్తి పరచడానికే ప్రయత్నాలు చేశారని మాయావతి ఆరోపించారు. ఇక బెహన్జీ కాంగ్రెస్ పై కూడా అంతే రీతిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అనుసరించిన విధి విధానాలే ఆ పార్టీని నిండా ముంచేశాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. యూపీలో సర్కారు ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, యూపీ ప్రజలందరూ బీఎస్పీకే ఓటు వేయాలని, ఇతర పార్టీలకు ఓటు వేయవద్దని మాయావతి మరోసారి విజ్ఞప్తి చేశారు.
పార్టీ నిర్మాణంలో బిజీ వున్నాను…
ఎన్నికలు దగ్గరపడుతున్నా… తాను కనిపించడం లేదని మీడియాతో సహా కొందరు విమర్శలు చేశారని మాయావతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని రోజులు తాను ఎక్కడికీ వెళ్లలేదని, పార్టీని బలోపేతం చేసే చర్యల్లో బిజీ బిజీగా గడిపానని మాయావతి వెల్లడించారు. తక్కువ మాట్లాడటం, ఎక్కువగా పనిచేయడం ఈ సూత్రాన్నే తమ పార్టీ బలంగా విశ్వసిస్తుందని మాయావతి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- agra rally
- BSP
- BSP Chief
- Mayawati
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

