న్యూఢిల్లీ: పొరుగు దేశమైన నేపాల్లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. రెండోసారి వచ్చిన భూకంపంతో ఢిల్లీ,-ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది.
భూప్రకంపనలతో ప్రజలు కార్యాలయాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు ఊగాయని, టీవీ స్క్రీన్లు, వస్తువులు కదిలాయని స్థానికులు తమ అనుభవాలను వివరించారు. భూకంప ప్రభావం ఉత్తరాఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాలలో చూపింది.