డెహ్రాడూన్: వాహనాల వేగం నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన పెద్ద స్పీడ్ బ్రేకర్ (Massive Speed Breaker) ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆ స్పీడ్ బ్రేకర్‌పై నుంచి వెళ్లిన వాహనాలు గాల్లో ఎగురుతున్నాయి. స్పీడ్‌గా వెళ్లిన ఒక స్కూటర్ ఎగిరిపడింది. దీంతో దానిని నడిపిన వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. క్లాక్ టవర్ సమీపంలోని రోడ్డుపై భారీ సైజులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. వాహన చోదకులను అప్రమత్తం చేసే సూచనలు కూడా లేవు. దీంతో వేగంగా వెళ్లే వాహనాలు గాల్లో ఎగురుతున్నాయి.
కాగా, కొంచెం స్పీడ్‌తో వెళ్లిన ఒక స్కూటర్ ఊహించని విధంగా గాలిలోకి ఎగిరి పడింది. దీంతో స్కూటర్ నడిపిన వ్యక్తి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడికి సహాయం చేశారు. అయితే ఈ స్పీడ్ బ్రేకర్ కారణంగా ఏడు ప్రమాదాలు నమోదయ్యాయి. మూడేళ్ల చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
మరోవైపు వాహనాల వేగం నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ బ్రేకర్ డిజైన్ లోపం కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్లే వాహనాలు గాలిలోకి ఎగురుతున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
This is a road in Dehradun.
CM @pushkardhami ji must take immediate action and hold the bureaucrat accountable who approved this flawed plan in the first place.
— Shashank Shekhar Jha (@shashank_ssj) December 11, 2024