కోల్‌కతా: ఒక విమానంలోకి పెద్ద పాము చొరబడింది. గమనించిన గ్రౌండ్ సిబ్బంది అలెర్ట్ చేయడంతో అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఆ సిబ్బంది పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ముంబై వెళ్లే ఇండిగో విమానం రాయ్‌పూర్ నుంచి బయలుదేరి కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అందులోని లగేజ్‌ను సిబ్బంది దించుతుండగా ఒక పాము జరజర పాకుతూ విమానంలోకి చొరబడింది. లగేజ్ బెల్ట్ రాడ్‌కు చుట్టుకుని ఉన్నది.
గమనించిన గ్రౌండ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు విషయం చెప్పారు. దీంతో అటవీశాఖ సిబ్బందిని రప్పించారు. వారు చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. అది ప్రమాదకార పాము కాదని తెలిపారు. జర్నలిస్ట్ తరుణ్ శుక్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Perhaps the snake wanted an @IndiGo6E flight as a belated 15th birthday offer yesterday.
— Tarun Shukla (@shukla_tarun) August 6, 2021
Thankfully, taken away by the Kolkata forest department. But just look at the speed : 🐍 ✈ pic.twitter.com/5oKg7zBcUX